పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ-11 సింగరేణి భూపాలపల్లి ఏరియాలో సాయిరాం సెక్యూరిటీ కాంట్రాక్ట్ కార్మికులను ఎలాంటి నిబంధనలు లేకుండా తిరిగి అందరిని డ్యూటీలోకి తీసుకోవాలని జిఎం రాజేశ్వర్ రెడ్డి కి సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ వెంకన్న కార్మికులతో వెళ్లి వినతిపత్రం అందించారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల విషయాన్ని జిఎం కు వివరించగా కొంత టైం పడుతుందని అప్పటివరకు ఓపికగా ఉండాలన్నారని వెంకన్న తెలిపారు