నైవేద్యం అల్పాహారం హోటల్ ను ప్రారంభించిన చినజీయర్ స్వామి..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ ఆరోగ్యకరమైన రుచులతో నైవేద్యం హోటల్ ను ప్రారంభించినందుకు ప్రజలకు సంపూర్ణమైన ఆహారం అందించేందుకు కృషి చేస్తున్న డాక్టర్ రామకృష్ణ, డాక్టర్ కిషోర్ మరియు రాజా లు అభినందనీయాలని ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ ఒకటో వార్డు నందు నైవేద్యం అల్పాహారం హోటల్లో ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ ఆధ్యాత్మికమైన ఆలోచనలతో నైవేద్యం హోటల్ లో ప్రారంభించడం జరిగిందని ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్న జీయర్ స్వామి చేతుల మీదగా ప్రారంభించడం జరిగిందని అలాగే ఎమ్మెల్యే నానాజీ ఆశీస్సులతో మే నెల ఒకటో తేదీ నుండి పూర్తిస్థాయిలో నైవేద్యం అందుబాటులో ఉంటుందని తెలియజేశారు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే లు పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, కురసాల కన్నబాబు, మాజీ కౌడా చైర్మన్ నాగిరెడ్డి నాగిరెడ్డి రాగిరెడ్డి చంద్రకళ దీప్తి,పట్టణ ప్రముఖ డాక్టర్లు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *