ఆదోని డివిజన్ బీ.సీ.ఫెడరేషన్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పూలే

200వజయంతిఘనంగావేడుకలు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 13 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని డివిజన్ బీ.సీ.ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన హోటల్ భీమాష్ రిసెప్షన్ హాల్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే 200 జయంతి ఉత్సవము ఘనంగా జరుపుకోవడం జరిగింది ముందుగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ పారిశ్రామిక విట్టారమేష్ , మరియు బి.సి. నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీ.సీ.నాయకులు మాట్లాడుతూ ఈయన కుల వివక్ష కు వ్యతిరేకంగా పోరాడి మహిళా విద్య, సామాజిక సమానత్వం కోసం కృషి చేసిన గొప్ప సంఘసంస్కర్త 1827 ఏప్రిల్ 11న మహారాష్ట్రలో జన్మించిన ఈయన తన భార్య సావిత్రిబాయి పూలేతో కలసి భారతదేశంలో బాలికల కోసం మొదటి పాఠశాల స్థాపించారు. కుల వ్యవస్థ అంటరానితనము లింగ వివక్షకు వ్యతిరేకంగా నిరంతరం పోరాడారు. మహిళా విద్య, మరియు వెనక బడిన వర్గాల వారి విద్య కోసం గొప్పగా కృషి చేశారు. 1873లో అనగారిన వర్గాల కోసము సత్య శోధక్ సమాజ్ ( సత్య అన్వేషకులు మండలి ) స్థాపించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకుబడినటువంటి, బీ.సీ. సంఘం జాతీయ కార్యదర్శి, బత్తిన కుబేరనాథ్ కి, మరియు ఉరుకుంద ఈరన్న స్వామి ( లక్ష్మీ నరసింహ ) డైరెక్టర్ గా నాయి బ్రాహ్మణ సంఘం నందు ఎన్నుకోబడినటువంటి ఎస్. సి.రంగస్వామి ( చిట్టి బాబు ) కి సన్మానం ఘనంగా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆదోని డివిజన్ వైస్ ప్రెసిడెంట్స్, దేవిశెట్టి ప్రకాష్, ధనపురం శేషన్న,కత్తి హనుమంతరావు, డివిజన్ ఆర్గనైజర్ షేక్ శావలి,తాలూకా అధ్యక్షులు మరియానిచెన్న బసప్ప,తాలూక గౌరవసలహాదారులు, బండారి రాజేశ్వరరావు, కపటి వీరభద్ర, బి రాముడు, నల్లారెడ్డి, బెస్తప్రకాష్, బెస్త దీపక్ కుమార్, పగడాల కిరణ్ కుమార్, దండుఅయ్యాలప్ప, వాల్మీకి నాయకులు బిటి.లక్ష్మన్న, కాళీ, నాయి బ్రాహ్మణ సేవా సంఘం సలహాదారులు అరికేరి మునిస్వామి, పసుపుల శ్రీనివాస్,కందనతి కేశవ్, కల్లుబావి శాంత, నరేంద్ర యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *