పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 10 తెలంగాణ రాష్ట్రంలో, మెట్ పల్లి మున్సిపల్ ఎన్నికల తరుణంలో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్న సందర్భంగా , మెట్ పల్లి మున్సిపల్ కోఆప్షన్ నోటిఫికేషన్ విడుదల కాగా గురువారం రోజు నా మెట్ పల్లి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో 7వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి అబ్దుల్ జాకీర్ పాషా, కోరుట్ల నియోజకవర్గం ఇన్చార్జి జువ్వాడి నరసింగారావు నాయకత్వంలో వారి ఆదేశాల మేరకు మెట్ పల్లి మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగా నామినేషన్ వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర ప్రజలు 100% కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉన్నారు ఈ రెండు సంవత్సరాల పరిపాలన లో మా 7 వార్డు అభివృద్ధికై జువ్వాడి నరసింగారావు ఆధ్వర్యంలో మా వార్డులో ఇందిరమ్మ ఇల్లు, సీఎం రిలీఫ్ ఫండ్ ,మైనారిటీలకు కుట్టు మిషన్లు మరియు రోడ్డు నిర్మాణాలు వార్డు అభివృద్ధి చేసుకున్నాము. కాంగ్రెస్ పార్టీ కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి కోసం జువ్వాడి నరసింహారావు అహర్నిశలు కష్టపడుతూ ప్రజలకు సేవ చేస్తున్నారు అదేవిధంగా కష్టపడ్డ కార్యకర్తలకు మర్చిపోకుండా నాకు కో ఆప్షన్ సభ్యుడి గా అవకాశం ఇస్తారాని ధన్యవాదాలు తెలుపుతున్నాను.