పయనించే సుర్యుడు న్యూస్ గట్టుప్పల్ ఏప్రిల్ 11. గట్టుప్పల్ మండల కేంద్రంలో చేనేత రుణమాఫీ చెక్కులను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. నేతన్నల బీమా పథకం కింద 7 గురు వ్యక్తులకు 35 లక్షల విలువ చేసే చెక్కుల పంపిణీ చేసారు . చేనేత రుణమాఫీ పథకం కింద 141 మంది నేతన్నలకు 1 కోటి 10 లక్షల 75 వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ నా చిన్ననాటి నుండి చేనేత కార్మికుల సమస్యలపై అవగాహన ఉంది . మా గ్రామంలో చేనేత వాళ్లతో కలిసిమెలిసి జీవించేవాళ్లం . టెక్నాలజీ పెరిగి మరమగ్గాలు వచ్చిన తర్వాత నేతన్న లకు కష్టాలు పెరిగాయి. నాగరిక ప్రపంచంలో ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ఘనత నేతన్నల దే . బట్టలు నేస్తున్న నేతన్నల జీవితాలు అంతంతమాత్రంగా ఉంటే.. అవి అమ్మి సొమ్ము చేసుకుంటున్నా వాళ్ళ జీవితాలు మాత్రం చాలా బాగున్నాయి . మరోమారు మీ సమస్యలపై అధ్యయనం చేసి ఒక నివేదిక తయారు చేసుకొని నేతన్నలను తీసుకొని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్తా అన్నారు. పేదరికంలో ఉండి చేనేత వృత్తి పైన ఆధారపడి జీవిస్తున్న నేతన్నల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి నేతన్నలకు న్యాయం చేస్తా అన్నారు . ప్రజా ప్రభుత్వం చేనేత కార్మికులను ఆదుకుంటుంది . నేతన్నల సమస్యలు తీర్చే వరకు నేను మీ వెంట ఉంటా. గట్టుప్పల్ మండల ఏర్పాటు నా రాజీనామా పుణ్యమే అన్నారు. ప్రతి ఒక్కరు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేత కార్మికులను ప్రోత్సహించాలన్నారు. గత ప్రభుత్వంలో చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రగల్బాలు పలికిన బిఆర్ఎస్ ప్రభుత్వం, ఎక్కడా కూడా రుణమాఫీ చేయలేదని విమర్శించారు . ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేనేత కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రుణమాఫీ చేయడం హర్సనీయమన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం తర్వాత చేనేత కార్మిక రంగం అతిపెద్దదని, సంక్షోభంలో ఉన్న చేనేత రంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పరుస్తుందన్నారు. చేనేత కార్మికుల ఆకలి చావులకు కాంగ్రెస్ ప్రభుత్వం దారి చూపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గట్టుప్పల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు, నేతన్నలు పాల్గొన్నారు.