గొప్ప సంఘ సంస్కర్త మహాత్మ జ్యోతిరావు

పూలే ఆశయాలను కొనసాగిద్దాం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే 199 వ జయంతి సందర్భంగా మహాత్మ జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించడం జరిగింది. సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ సామాజిక తత్వవేత్తగా ఉద్యమకారుడుగా సంఘ సేవకుడిగా పూలే భారత దేశంలో కుల వివక్షకు వ్యతిరేకంగా కోట్లాది ప్రజానీకం కోసం పేద అణ గారిని అంటరాని ప్రజల హక్కుల కోసం చివరి శ్వాస వరకు పోరాడారు మహారాష్ట్రలోని పూణేలోని జబుర్దాలో 1827 ఏప్రిల్ 11వ తేదీ మహాత్మ జ్యోతిరావు పూలే జన్మించాడు 13 సంవత్సరాల వయసులోనే సావిత్రిబాయి పూలే తో ఆయనకు వివాహం జరిగింది. దేశం అనే దేహానికి శూద్రులు ప్రాణం రక్త నాళాల వంటి వారు అని ఎలుగెత్తి చాటిన మహనీయుడు జ్యోతిరావు పూలే కులం పేరుతో తరాతరాలుగా అన్ని రకాలుగా అణచివేతకు గురైన దళిత బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారత కల్పనకు కృషి చేసిన గొప్ప సంస్కర్త మహాత్మ జ్యోతిరావు పూలే 1873 సెప్టెంబర్ 24వ నా సత్యశోధక్ సమాజ్ స్థాపించి ఎన్నో సేవలను అందించి మహాత్మునిగా ఘనత ఎక్కాడు ప్రతి కులానికి జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతూ పూలే అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి సూచించాడు అసమానతలకు విద్య ఉద్యోగ అవకాశాలు లోపించిన వారికి రిజర్వేషన్లు కల్పించాలని ఆనాడే పోరాడి ముందు చూపు ప్రదర్శించాడు ఏరోజైతే మనిషి బానిసగా మారుతాడో ఆరోజునే అతని సద్గుణాల్లో సగభాగం నశిస్తాయి అన్న గ్రీకు మహాకవి హుమరు మాటల స్ఫూర్తితో శూద్ర అతిశూద్ర జాతుల విముక్తి కోసం పూలే జీవితాంతం దృఢంగా పోరాడారు దక్షిణాఫ్రికా జాతీయ ఉద్యమ నాయకుడు నెల్సన్ మండేలా భారత దేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆయనకు సమర్పించాలని నిర్ణయించుకున్న కానుక పూలే రచించిన మహోత్తర గ్రంథం గులాంగిరి నిరంతరం సమ సమాజ స్థాపన కోసం పరితపించిన పూలే దీర్ఘకాలం జబ్బుతో బాధపడుతూ 1890 నవంబర్ 28న కన్నుమూశాడు కుల వివక్షను ఎదిరించి బడుగు వర్గాల హక్కుల కోసం కృషిచేసిన మహానీయులుగా పోలే పేరు చరిత్రలో నిలిచిపోతుందని వారు అన్నారు వారి ఆశయాలను నేటి తరం గుర్తుపెట్టుకుని వారి పోరాటపటమను మనమందరం స్వీకరించాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు సంజయ్ కార్యదర్శి శశిధర్ నాయకులు జగన్, మహేష్ ఉమాకాంత్, నరసింహ, వీరేష్ , రాజు , పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *