పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జ్యోతి రావు ఫూలే చేసిన సేవలు భారత సమాజాన్ని మార్పు వైపు నడిపించాయి అని, అందుకే ఆయనను “సామాజిక విప్లవకారుడు”గా పేరొందారని సీఐటీయూ జిల్లా నాయకులు పిట్టల అర్జున్ అన్నారు. ఆయన జయంతి ని పురస్కరించుకొని శనివారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని మూడు రోడ్ల ప్రధాన కూడలి లో ని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాతూ సామాజిక అసమానతలు కు వ్యతిరేకంగా మహిళల ఆత్మ గౌరవాన్ని పెంచే దిశ గా ఉద్యమాలు ను నిర్మించిన దిశాలి మహత్మ పూలే ఆని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మురహరి రఘు, హమాలి యూనియన్ నాయకులు హనుమంతరావు రాంబాబు లు పాల్గొన్నారు.