పలు శుభ కార్యక్రమాలకు హాజరైన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఏప్రిల్ 13 పెనుగంచిప్రోలు గ్రామం లో జి.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్ నందు వత్సవాయి మండలం రామచంద్రపురం గ్రామానికి చెందిన పాపినేని శ్రీనివాసరావు-ఉషారాణి కుమారుడు వెంకట నిరోష్ వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు అదేవిధంగా పెనుగంచిప్రోలు శృతి కన్వెన్షన్ హాల్ నందు వత్సవాయి గ్రామానికి చెందిన గుత్తా కృష్ణమూర్తి-ఏకాశమ్మ (లేటు) కుమార్తె నవ్య వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యులు వూట్ల నాగమణి నాగేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు గుత్త శంకర్రావు, గ్రామ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, రాష్ట్ర బీసీ సెల్ విభాగ ప్రధాన కార్యదర్శి బత్తుల రామారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, జిల్లా కార్యదర్శి మాతంగి నాగబాబు, జిల్లా బీసీ సెల్ విభాగ ఉపాధ్యక్షులు చేని రాంబాబు, నియోజకవర్గ ఐటీ, రైతు విభాగాల అధ్యక్షులు బండి రంజిత్, కనగాల రమేష్, మండల సోషల్ మీడియా, యువజన, ఎస్సీ సెల్ , విద్యార్థి విభాగాల అధ్యక్షులు కోయ బాబి, నల్లబోతుల వెంకటేష్, బొడ్డు రవి, ఆరే సాయి, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *