రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి రావాలని పాద యాత్ర .

* స్వాగతం పలికిన ఉడుతలపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు .

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 14 : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఓ అభిమాని పాదయాత్ర చేపట్టారు. నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన లింగస్వామి తన సొంత గ్రామం నుంచే పాదయాత్ర చేపట్టారు. చెరువుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వరకు ఈ పాదయాత్ర కొనసాగుతుంది. దీనిలో భాగంగా లింగస్వామి చండూరు మండలం ఉడుతలపల్లి గ్రామపంచాయతీకి చేరుకున్నారు. కాంగ్రెస్ , నాయకులు కార్యకర్తలు లింగస్వామికి ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉడుతలపళ్లి గ్రామ సర్పంచ్ కావలిశివాని సురేష్, మాజీ సర్పంచ్ కావాలా ఆంజనేయులు, మాజీ సర్పంచ్ మేకల వెంకన్న, ఇందిరమ్మ కమిటీ సభ్యులు బుసిపాక శంకర్ , వార్డ్ మెంబర్ కావలి అశోక్ అదేవిధంగా గ్రామస్తులు, గంట వెంకన్న, మెరుగు చిరంజీవి కొంక నరేందర్, అనీలు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *