అంబేద్కర్ విగ్రహ పరిసరాల్లో పారిశుధ్య పనుల పర్యవేక్షణ

పయనించే సూర్యుడు: ఏప్రిల్ 14/26 సత్తుపల్లి రూరల్: రిపోర్టర్ : గద్దె. విజయబాబు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని, పట్టణంలోని 15వ వార్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహ పరిసరాలను సత్తుపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి రిహానా కమల్ పాషా సందర్శించారు. జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేలా విగ్రహం వద్ద జరుగుతున్న క్లీనింగ్ పనులను ఆమె స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహనీయుల జయంతి కార్యక్రమాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా మున్సిపల్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోందని తెలిపారు. పాల్గొన్న ముఖ్యులు: ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ , స్థానిక వార్డు కౌన్సిలర్ దూదిపాల రాంబాబు , కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంతారావు ,రాజు తదితరులు పాల్గొని పనులను పరిశీలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *