కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన నూతన డ్రైనేజీ పనులు.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. ఆదోని టిడిపి ఇంచార్జి మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం మంజూరు చేసిన నూతన డ్రైన్ పనులను ఇందిరా నగర్ టిడిపి ఇంచార్జి ఐ సి. రామకృష్ణ అడ్వకేట్ ఆధ్వర్యంలో మహాయోగి లక్ష్మమ్మ నగర్ కాలనీ లో సుమారు 15.50 లక్షల తో నూతన డ్రైన్ పనులకు భూమి పూజ చేయడం జరిగింది . ఈ సందర్భంగా. ఇందిరా నగర్ టిడిపి ఇంచార్జి ఐ సి రామకృష్ణ అడ్వకే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల యొక్క బాధలను తీర్చే క్రమంలో బాగంగా ఎన్నో సంవత్సరాలుగా కాలువలు లేక వర్షా కాలంలో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారని ఇప్పుడు కూటమి ప్రభుత్వం నూతన డ్రైన్ నిర్మాణం చేపట్టడం వల్ల ఇన్నాళ్లు పడ్డ ఇబ్బందులు తొలగి పోతాయని తెలిపారు. డ్రైన్ మంజూరు చేసినందుకు పార్థసారథికి, టిడిపి ఆదోని ఇంచార్జి కి.మీనాక్షినాయుడు కి, జనసేన ఇంచార్జి మల్లప్ప కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వలి, జనసేన పట్టణ అధ్యక్షులు రేణువర్మ, రాకేష్, ,గౌస్ , చిన్న మాజీ కౌన్సిలర్,బీమా, ఉరుకుందు,బాలరాజు ,సోమప్ప అంజి, రాజేష్, ,మున్సిపల్ డీ ఈ ఏ ఈ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *