పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ ఆదోని మండల అధ్యక్షుడు శివప్ప కుమారుడు వీరేంద్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ మధు హాస్పిటల్కు వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.