యాదవ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజకీయ సదస్సు విజయవంతం: రాష్ట్ర అధ్యక్షులుబేరి రామచందర్ యాదవ్

పయనించే సూర్యుడు, ఏప్రిల్ 14 రంగారెడ్డిజిల్లాప్రతినిధి(ఎస్ఎంకుమార్) హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో యాదవ జేఏసీ ఆధ్వ ర్యంలో నిర్వహించిన యాదవ రాజకీయ సదస్సు విజయవంతంగా ముగిసింది. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా యాదవ సంఘాలకు చెందిన నాయకులు, నాయ కురాళ్ళు భారీ ఎత్తున తరలి వచ్చి యాదవ రాజకీయ సదస్సును విజయ వంతం చేసినట్లు బిసి ఐక్యవేదిక తెలం గాణ రాష్ట్ర అధ్యక్షులు బేరి రామచంద ర్ యాదవ్ పేర్కొన్నారు.యాదవ్‌లపై కొనసాగుతున్న రాజకీయ అన్యా యాన్ని ఇక సహించమని ఐక్య శక్తితో హక్కులు సాధించాలనే ప్రధాన లక్ష్యంగా నిర్వహిం చారు యాదవ్ జేఏసీ రాజకీయ సద స్సు.సదస్సు ప్రారంభోత్స వానికి ముందు గా బీసీల ఆరాధ్య దైవమైన బీసీ హక్కు ల కోసం నిరంతరం పోరా డిన బిపి మండల్ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పించారు. బీపీ మండల్ చిత్రపటానికి పూలమాల లు వేసి విప్లవ జోహార్లు అర్పించారు. మండల్ ఆశయా లను సాధిద్దాం అన్న ప్రతిజ్ఞ పూనారు. ఈ సదస్సు యాదవ్ సమాజంలో నూతన ఉత్సాహాన్ని నింపిం ది. సభ నిర్వహణ కమిటీ సభ్యులు యాదవ్ జేఏసీ చైర్మన్ డా. దాసరి అజయ్ కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ డా. చిలకల శ్రీనివాస్ యాద వ్ సభను ఉద్దేశించి కీలక ప్రసంగాలు చేశారు. సదస్సులో పలువురు వక్తలు ప్రసంగిస్తూ దేశంలోనే పెద్ద సామాజిక వర్గాలలో ఒకటైన యాదవ్ సమాజం సంఖ్యలో బలంగా ఉన్నప్పటికీ తెలంగాణాలో రాజకీయ,ఆర్థిక,విద్యా రంగాలలో అన్యాయానికి గురవుతోందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యాదవ్‌లలో ఐక్యత లేకపోవడం, సమన్వయం లేకపోవడం వల్లే మనకు రావలసిన హక్కులు ఇతర వర్గాల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. ఇప్పటికీ యాదవ్ సమా జం ఓటు బ్యాంక్‌గా మాత్రమే ఉపయోగించబ డుతోంది తప్ప,అధికారంలో సరైన భాగస్వామ్యం కల్పించడం లేదని వారు తీవ్రంగా విమర్శించారు.ఎన్నికల సమ యంలో మాత్రమే హామీలు ఇచ్చి, తరువాత పూర్తిగా మర్చిపోతున్న రాజ కీయ నాయకుల ద్వంద్వ వైఖరిని ఎండ గట్టేలా ఉద్యమిద్దామని పిలుపునిచ్చా రు. యాదవ్‌లకు రావలసిన కార్పొరేషన్ నిధులను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేయ డం, నామినేటెడ్ పదవులలో ప్రాధాన్యత ఇవ్వకపోవడం, యాదవ్ హాస్టల్ భవనా న్ని ప్రారంభించకుండా ఆలస్యం చేయ డం, ప్రభుత్వ స్థాయిలో సరైన గుర్తింపు లేకపోవడం ఇవన్నీ యాదవ్‌లపై జరుగు తున్న వ్యవస్థాగత అన్యాయానికి నిదర్శ నమని పేర్కొన్నారు. ప్రస్తుతప్రజా ప్రతి నిధులు యాదవ్‌లను కేవలం ఓట్ల కోసం మాత్రమే ఉపయోగించుకుని, అధికారం లో భాగస్వామ్యం ఇవ్వకుండా కుట్రపూరి త రాజకీయాలు చేస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపై యాదవ్ సమాజం మౌనంగా ఉండరాదని,రా జ్యాంగబద్ధంగా పోరాటం చేస్తూ మన హక్కులను సాధించుకునే దిశగా ముం దుకు సాగాలని పిలుపునిచ్చారు. ప్రతి యాదవ్ నాయకుడు తన ప్రాంతం లో సమాజాన్ని చైతన్యవంతం చేసి,ఐక్యత కోసం కృషి చేయాలని సూచించా రు. యాదవ్ సమాజం కేవలం సామాజి కంగా కాకుండా రాజకీయంగా కూడా బలప డాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. రాజకీయ అధికారమే సమాజ అభివృద్ధి కి ప్రధాన ఆయుధ మని,అందుకోసం ప్రతి యాదవ్ యువ కుడు,నాయకుడు రాజకీయంగా చైతన్య వంతం కావాలని పిలుపునిచ్చారు.యా దవ్‌లకు సరైన ప్రాతినిధ్యం లభించాలం టే ఐక్యశక్తిగా ఎదగాల్సిన అవసరం ఉందని, చిన్నచిన్న విభేదా లను పక్కన పెట్టి ఒకే వేదికపైకి రావాలని సూచించా రు.యాదవ్ జేఏసీ ఈ దిశగా చేస్తున్న కృషి అభినందనీయ మని పేర్కొన్నారు. బీసీల పితామహుడు బీపీ మండల్ వర్ధంతి సందర్భంగా ఈ మహాసభ నిర్వహించినట్లు తెలిపారు. మండల్ బీసీల హక్కుల కోసం చేసిన సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనందరి పై ఉందని పేర్కొ న్నారు. కోక్ పేట్ లోనీ యాదవ భవనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం త్వరగా స్పందించి ఈ భవనాన్ని ప్రారంభించి యాదవ విద్యార్థులకు అంకితం చేయాలని డిమాండ్ చేశారు. ఈశ్వరమ్మ యాదవ్ మాట్లాడుతూ యాదవులు అన్ని రంగాల్లో ముందజ లోకి రావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్, వైస్ చైర్మన్ చిలకల శ్రీనివాస్ యాదవ్,హైద రాబాద్ ఎంపీ కంటెస్టెడ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్, ఉష్కల పాండు యాదవ్,రా జ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్, జాంబాగ్ యాదవ్ సంఘం చైర్మన్ చిట్టబోయిన నందకిషోర్ యాదవ్,జెసి రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతి నేని పాములేటి యాదవ్, సిరిబోయిన రమణ యాదవ్, షాద్నగర్ గడ్డం శ్రీని వాస్ యాద వ్, రామకృష్ణ యాద వ్,ఓరుగంటి వెంకటేశ్వర్లు యాద వ్,అంబర్పేట్ శ్రీనివాస్ యాదవ్,వి కారాబాద్ జిల్లా శ్రీశైలం యాదవ్, యాదవ్ సంఘాల నాయకులు,జేఏసీ రాష్ట్ర, నాయకులు జిల్లా నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయ వంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *