పయనించే సూర్యుడు-15-04-2026-రాజంపేట న్యూస్ : బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఎస్ టి యు నాయకులు పేర్కొన్నారు. రాష్ట్రోపాధ్యాయ సంఘము (ఎస్ టీ యు ) రాజంపేట రీజనల్ కన్వీనర్ జి.పెంచలయ్య ఆధ్వర్యంలో ఎం ఆర్ సి నందు మంగళవారం రాజ్యాంగ నిర్మాత, ప్రముఖ సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త మరియు న్యాయవాది అయిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్టియు నాయకులు మాట్లాడుతూ అంటరానితనం, కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి దళితులు మరియు మహిళల హక్కుల కోసం కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను పలువురు వక్తలు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు ఎన్.సత్యనారాయణ, మొలక ఓబులేసు, నరసింహులు, మురళీ మనోహర్, సుబ్బారెడ్డి, చంద్రశేఖర్, వెంకటేశ్వర్ రెడ్డి, మోహన్ రావు, నాగరాజు, మల్లిఖార్జున రాజు, నారాయణరాజు, గోపాల్ రెడ్డి, సర్తాజ్ హుస్సేన్, హరి, సిద్దయ్య, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.