పయనించే సూర్యుడు ) 14-ఏప్రిల్ కొడంగల్ నియోజకవర్గం రిపోర్టర్ హన్మంతు : అమెరికాతో వాణిజ్య ఒప్పందం మూలంగా భారత రైతాంగ వ్యవసాయ రంగం తీవ్రంగా దెబ్బతింటుందని. తక్షణమే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంటి సురేష్ కుమార్ అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని ఇంద్ర పార్క్ వద్ద రైతు సంఘాలు నిర్వహించిన ధర్నాలో పాల్గొని ఆయన మాట్లాడుతూ (1). అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు, (2). పీయూస్ గోయలను మంత్రి పదవి నుండి తొలగించాలన్నారు, (3). రైతులకు సబ్సిడీ, బోనస్ లు కొనసాగించాలన్నారు, (4). స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం 50 శాతం మద్దతు ధరల చట్టం చేయాలన్నారు ,(5). రైతు రుణాల్ని మాఫీ చేయాలన్నారు, (6). పంటల బీమా పథకాన్ని రైతులకు ఉపయోగపడే విధంగా మార్చాలన్నారు, (7). నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం రద్దు చేయాలన్నారు, (8). విత్తన విద్యుత్ బిల్లును ఉపసంహరించుకోవాలన్నారు, (9). వి బి జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.