ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

పయనించే సూర్యుడు, 15 ఏప్రిల్ 2026, భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి , నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలో మంగళవారం రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా భీంగల్ ప్రాంత దళిత ఐక్య సంఘటన అధ్యక్షులు ఖండే కాంతయ్య వహిస్తూ ప్రపంచంలోనే గొప్ప దర్శని కత ప్రదర్శించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అలాగే వారు అందించిన రాజ్యాంగ స్ఫూర్తి వలన అందరూ హక్కుల అనుభవిస్తూ సమాజ నిర్మాణంలో భాగస్వామ్యలు కావాలని అన్నారు. అలాగే ఈనాడు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ వైస్ చైర్మన్ లతా జేజే నరసయ్య, కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ అంబేద్కర్ గొప్ప దార్శనికుడుగా, రాజనీతిజ్ఞుడుగా, జర్నలిస్టుగా, న్యాయవాదిగా భారత సమాజ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కన్నె సురేందర్, భీంగల్ పట్టణ కౌన్సిలర్లు,మాజీ కౌన్సిలర్లు మాజీ ప్రజాప్రతినిధులు చెప్పాలా గణేష్,పర్సనవీన్, తుమ్మ రవీందర్, దుమల భూమన్న,దేవదాసు,ఎస్ఐ , డి టి ఎఫ్ నాయకులు ఎం బాలయ్య ఈశ్వర్ బట్టు సునీల్, బట్టు అనిల్, బద్దం సంపత్, టారమెటి రాహుల్, భీమ రవీందర్,అంబేద్కర్ యువజన సంఘాల నాయకులు ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచ్ లు అంబేద్కర్ వాదులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *