డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆయనఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనివిగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) సర్పవరం గ్రామంలో ఎస్సీపేట వద్ద అంబేద్కర్ విగ్రహానికి 135వ జయంతిని పురస్కరించుకునే ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవిసి గనివాల్ అర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి చిన్నారులకు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అంబేద్కర్ ఏ కులాలకు ఏ మతానికో వ్యక్తి కాదని అందరివాడు అంబేద్కర్ అని ఆయన రచించిన రాజ్యాంగం వల్లే ఈరోజు భారతదేశ అభివృద్ధి పథంలో దూసుకు వెళ్తుందని అన్నారు. ఆయనను యువత అనుసరించి రాజ్యాంగాన్ని తెలుసుకొని ముందుకు వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమవరం భోజనం హోటల్ అధినేత రాజు, పుల్ల కృష్ణ, అంబేద్కర్ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *