పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ పోతాన్ పల్లి గ్రామ సర్పంచ్ కవ్వం మాధవరెడ్డి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత, ఉద్యమాల స్ఫూర్తి ప్రదాత మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో ఉన్నత చదువులు చదివి ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందాలని ఆయన సేవలు నేటి సమాజంలో ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రకాల వర్గాల వారికి సమన్యాయం సమతుల్యత పాటించి అవకాశాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశోక్, మండల కో ఆప్షన్ మాజీ సభ్యులు మహ్మద్ అలీ, జాతీయ వినియోగదారుల ఫోరం కమిషన్ మెదక్ జిల్లా చైర్మన్ బాలసాయి హరిప్రసాద్, మాజీ ఉపసర్పంచ్ గూళ్ల సిద్ధిరాములు, వార్డు సభ్యులు గుడికందుల సౌందర్య బాగులు, అరికెల లావణ్య రవి, లింగ శ్రీనివాస్, ఆరిఫ్, అంగన్వాడి టీచర్లు సిద్ధమ్మ లలిత సీఏ షబానా, ఫీల్డ్ అసిస్టెంట్ యాదగిరి, కసాన్ పల్లి మాజీ సర్పంచ్ గాదె స్వామి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బలిజ భూమలింగం, గుళ్ల శేఖర్, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు గుడికందుల బాగులు, అంబేద్కర్ సంఘం నాయకులు ఆర్ఎంపీ డాక్టర్ శ్రీకాంత్, గుర్రం యాదగిరి, స్వామి,వెంకటి, జోడు లక్ష్మణ్, బాలసాయి నర్సింలు దేవదాసు తదితరులు పాల్గొన్నారు.