జహీరాబాద్‌లో డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15(సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం ప్రతినిధి స్వాతి.నర్సిములు ) 1,117 మందికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు. రాజ్యాంగ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపు. జహీరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలు జహీరాబాద్ నియోజకవర్గంలో ఘనంగా జరిగాయి. రంజొల్ అంబేద్కర్ సంఘం ఆహ్వానం మేరకు స్థానిక శాసనసభ్యుడు కొనింటి మాణిక్ రావు ఈ వేడుకల్లో పాల్గొని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించిన గొప్ప గ్రంథమని పేర్కొన్నారు. అంబేద్కర్ చూపిన బాటలో సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. సంక్షేమ పథకాల పంపిణీ: అంబేద్కర్ జయంతి సందర్భంగా జహీరాబాద్ పట్టణంతో పాటు జహీరాబాద్, ఝరాసంగం, న్యాలకల్, మొగుడంపల్లి మండలాలకు చెందిన 1,117 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. స్థానిక ఎస్వీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. పాల్గొన్న వారు: ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశం, సభ్యుడు షేక్ ఫరీద్, నాయకులు నామ రవికిరణ్, ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షుడు బండి మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ తంజీమ్, యాకూబ్ పాల్గొన్నారు. కౌన్సిలర్లు గౌస్ గౌరీ, జాకీర్, మహిపాల్, దీపక్, విశ్వేశ్వర్, అబ్దుల్లా, స్వప్న ప్రవీణ్, ప్రేమలత శంకర్ రెడ్డి సహా వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *