ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలోరెండు సిమెంట్ బెంచ్ లు వితరణ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 2026 గూడూరు న్యూస్ గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో బుధవారం గూడూరు రూరల్ మండలం వెంకటేశుపల్లి గ్రామంలోని బీసీ కాలనీ నందు నిర్మించి ఉన్న శ్రీరామాలయం నందు మనుబోలు కిష్టయ్య మనుబోలు శ్రీనివాసులు సూచనల మేరకు ప్రగతి సేవా సంస్థ కుటుంబ సభ్యులైన పయ్యావుల మురళి నాయుడు మరియు గోల్డ్ షాప్ మల్లికార్జున్ సంపూర్ణ సహకారంతో రెండు సిమెంట్ బెంచ్ లను బహుకరించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ సేవా కార్యక్రమాలతో పాటు ప్రగతి సేవా సంస్థ అన్ని కార్యక్రమాల్లో కూడా ముందుంటుందని అదేవిధంగా గతంలో తూర్పు కనుపూరు ముత్యాలమ్మ దేవస్థానం మరియు తదితర ప్రముఖ దేవస్థానాల్లో కూడా సిమెంట్ బెంచీలను ప్రగతి సేవా సంస్థ ద్వారా ఏర్పాటు చేశామని తెలియజేశారు. సిమెంట్ బెంచీలు ఏర్పాటుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన ప్రగతి కుటుంబ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రగతి కుటుంబ సభ్యులు పయ్యావుల మురళి నాయుడు వాకాటి రామ్మోహన్రావు పోతిరెడ్డి పెంచలయ్య ,గోల్డ్ షాప్ మళ్లీ, వెంకట్రావు, నాగేంద్ర గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *