
పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ. మంత్రాలయం నియోజకవర్గంలోని కోసిగి పట్టణంలో నిర్వహించిన అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులుగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ , మంత్రాలయం టీడీపీ ఇన్చార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి గ పాల్గొన్నారు. అలాగే వారి సోదరులు మంత్రాలయం సొసైటీ చైర్మన్ ఎన్. రామకృష్ణ రెడ్డి , జనసేన ఇన్చార్జి లక్ష్మన్న , బీజేపీ ఇన్చార్జి విష్ణువర్ధన్ రెడ్డి హాజరై అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. అనంతరం పేద ప్రజలకు కేవలం ₹5కే భోజనం అందజేశారు. ఏపీలో గ్రామాలకు విస్తరిస్తున్న అన్న క్యాంటీన్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరో 62 కొత్త అన్న క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి.మొత్తం అన్న క్యాంటీన్లు: 269ఇప్పటికే లబ్ధి పొందిన వారు: 8.80 కోట్ల మంది కేవలం ₹5కే భోజనం అందించే విశిష్ట సేవఇప్పటివరకు పట్టణాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సేవలు ఇప్పుడు గ్రామాలకు కూడా విస్తరించడం ద్వారా మరింత మంది పేద ప్రజలకు ప్రయోజనం కలగనుంది.పేదల ఆకలి తీర్చే మహత్తర పథకంఅన్న క్యాంటీన్ పథకం పేదల ఆకలి తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తోంది. రోజుకు లక్షల మందికి ఆహారం అందిస్తూ సామాజిక సేవలో ఆదర్శంగా నిలుస్తోంది.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.