ఉస్మానియా అరుణతార కామ్రేడ్ జార్జిరెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

* గౌతమ్ కుమార్ పిలుపు

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 బోధన్ : యువమేధావి ఉస్మానియా అరుణతార పిడిఎస్యు వ్యవస్థాపకుడు కామ్రేడ్ జార్జిరెడ్డి 54 వర్ధంతి సందర్భంగా బోధన్ పట్టణంలో కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా పిడిఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతం కుమార్ మాట్లాడుతూ జీనా హై తో మర్నా సికో కధo కధం ఫర్ లడ్న సీకో అంటూ నినదిస్తూ ప్రగతిశీల బాబాజాలంతో విద్యార్థి ఉద్యమాలకు రగిలే జ్వాలగా నిలిచి విద్యార్థుల హక్కులకై విద్యా రంగా సమస్యల పరిష్కారానికై ఉద్యమించిన వ్యక్తి అని శాస్త్ర విద్యా సాధనకై పోరాడిన యువ మేధావి అని వారిని స్ఫూర్తిగా తీసుకొని విద్యార్థులు ఉద్యమించాలని పిలుపునిచ్చారుఉస్మానియా యూనివర్సిటీలో కామ్రేడ్ జార్జి రెడ్డిని మతోన్మాద గుండాలు దాడి చేసి హత్య చేసి 54 ఏళ్లు దాటిన నేటికీ ఆయన విద్యార్థులకు గుండెల్లో జీవించే ఉన్నాడని ఆయన నిత్యం విద్యార్థులను చైతన్యవంతం చేస్తూ ఉద్యమాలకు స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నాడని అన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ పట్టణ ప్రధాన కార్యదర్శి కర్రే ఆకాష్ నాయకులు వికాస్ గంగాధర్ సచిన్ మనోజ్ శివాజీ ప్రకాష్ సతీష్ కార్తీక్ సాయి ఐఎఫ్టియు నాయకులు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *