“ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక”లో భాగంగా రేపు మండల సమావేశం

పయనించే సూర్యుడు ఏప్రిల్ 16 నాగర్కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రేపు “ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమైన మండల స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సమావేశం ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా మండల పరిధిలోని గౌరవ సర్పంచులు, ఉపసర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొని తమ తమ శాఖలకు సంబంధించిన ప్రభుత్వ పథకాల పురోగతిని వివరించనున్నారు. ప్రజలకు అందిస్తున్న సేవలు, అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించబడుతుంది. కావున సంబంధిత ప్రజాప్రతినిధులు, అధికారులు సమయానికి హాజరై సమావేశాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *