పల్నాడు జిల్లా ఐటీ వింగ్ సెక్రటరీ బిరుదు అనంత బాబుకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 16 యడ్లపాడు మండల ప్రతినిధి పల్నాడు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ సెక్రటరీగా సేవలందిస్తున్న బిరుదు అనంత బాబు జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా మండలానికి చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే మండలానికి చెందిన ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న అనంత బాబు గారు, ఐటీ వింగ్ ద్వారా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని నాయకులు కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు వైసీపీ నాయకులు, యువజన విభాగం సభ్యులు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *