6 గురు డేకాయిటీ గ్యాంగ్ అరెస్ట్

ఆరు సెల్ ఫోన్లు, షిఫ్ట్ డిజైర్ కారు, ఒక స్కూటీ ,15 గ్రాముల గోల్డ్ స్వాధీనం

పయనించే సూర్యుడు. మేడ్చల్ జిల్లా..కీసర, ఏప్రిల్ 12 మేడ్చల్ జిల్లా.. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలోని కీసర పోలీస్ స్టేషన్లో డిసిపి శ్రీధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు రోజుల క్రితం బాధితుడుపై దాడి చేసి 15 గ్రాముల గోల్డ్ , షిఫ్ట్ కార్ , ఆరు సెల్ఫోన్లో, ఒక స్కూటీ స్వాధీనం చేసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నాలుగు రోజుల్లో కేసులు చేదించారు. ఏడుగురు నిందితుల్లో ఒకరు తప్పించుకోగా ఆరుగురుని అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించారు. గతంలో అబ్దుల్లాపూర్మెట్ ఘట్కేసర్ , కీసర పలు దొంగతనాలు చేసినట్టు తెలిపారు. నిందితులు 1. కుసుమ కార్తీక్, 2 రామ్ రాజా , 3. బబ్లు సింగ్, 4. కందుల సాయి తేజ,5. గండ్ల శ్రావణ్, 6. మాచర్ల పవన్ కళ్యాణ్, 7 చెన్నకేశవుల పవన్ కళ్యాణ్ పరారీ పరారీలో ఉన్నాడు. అందరూ వరంగల్ ప్రాంతానికి చెందినవార. Grinder app gay ఆప్ ద్వారా పరిచయం చేసుకొని గేలను టార్గెట్ చేస్తూ వారిని దోచుకుంటున్నారు. వారిని వీడియోలు ఫోటోలు తీస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద ఉన్న సొత్తును బ్లాక్మెయిల్ కు పాల్పడుతున్నారు. సోషల్ మీడియా ప్రైవేట్ యాప్ మోజులో పడద్దని యువత అప్రమత్తంగా ఉండాలని డిసిపి సిహెచ్ శ్రీధర్ సూచించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *