న్యాయవాదుల ఆధ్వర్యంలో జ్యోతిబాపూలే జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు, కోరుట్ల, ఏప్రిల్ 12 జగిత్యాల జిల్లా కోరుట్ల కోర్ట్ ప్రెసిడెంట్ మరియు బార్ అసోసియేషన్, న్యాయవాదుల ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబా పులే జయంతిని ఘనంగా నిర్వహించారు.పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కోరుట్ల కోర్ట్ బార్ ప్రెసిడెంట్ తోట ఆంజనేయులు మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం అనగారిన జాతులకు విద్యను అందించడం కోసం, అంటరానితనం నిర్మూలన కోసం పూలే దంపతులు ఎంతగానో కృషి చేశారన్నారు. జనరల్ సెక్రెటరీ సుతారి శ్రీనివాస్ మాట్లాడుతూ సమాజంలో సగభాగమైన స్త్రీలు అభివృద్ధి చెందకపోతే దేశానికి పురోగతి అసాధ్యమని విశ్వసించిన జ్యోతిరావు పూలే నాడే మహిళా విద్యకు తొలి జ్యోతి వెలిగించారని తన సతీమణి సావిత్రిబాయి పూలేను పాఠశాలకు పంపి సమాజానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు. సీనియర్ న్యాయవాది కొంపల్లి సురేష్ మాట్లాడుతూ అనాధ శిశువులకు ఆశ్రయం కల్పించి, వితంతువుల పునర్వివాహానికి మద్దతుగా బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారని గుర్తు చేశారు. సీనియర్ న్యాయవాది చింత నారాయణ సూర్యప్రసాద్ మాట్లాడుతూ మహాత్మ జ్యోతిరావు పూలే సమాజంలో సమానత్వం విద్యా విస్తరణ మహిళా సాధికారత కోసం కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు అన్నగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.ప్రతి ఒక్కరూ విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని సమాజంలో వివక్ష లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఆయన ఆశయమని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బార్ వైస్ ప్రెసిడెంట్ అంబల్ల నాగ నిర్మల, క్యాషియర్ చింత కింది ప్రేమ్, జాయింట్ సెక్రటరీ కడకుంట్ల దినేష్, సీనియర్ ఈసీ మెంబర్స్ మరియు జూనియర్ ఈసి మెంబర్స్ సీనియర్ న్యాయవాదులు సదాశివరాజు, ఆడెపు వినోద్, గొనె సదానందం నేత, ఓటకారి శ్రీనివాస్, అలాగే మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ మెంబర్ కస్తూరి రమేష్, దురుశెట్టి శివ, గాంధారి శ్రీనివాస్, గంగాధర్, ఊరడి నరేందర్, చిట్యాల శివ, బద్రి సృజన్, లవధ్య రాకేష్, గట్ల సృజన్, వివేక్, గణేష్, అల్లే రాము, పసియుద్దిన్, ఇనాస్, రాజు, శ్రావణి, లక్ష్మణ్, రామకృష్ణ న్యాయవాదులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *