ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199 జయంతి వేడుకలు..

పయనించే సూర్యుడు12-4-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు ) జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలం కేంద్రంలో బీసీ,ఎస్సీ,ఎస్టీ – జేఏసీ గొల్లపెల్లి పట్టణ అధ్యక్షులు శాతల్ల లక్ష్మణ్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూలే గారి 199వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించరు.ముఖ్య అతిథిగ గ్రామ సర్పంచ్ నల్ల నీరజా సతీష్ రెడ్డి, ఉప సర్పంచ్ గురిజాల బుచ్చిరెడ్డి, పాల్గొని పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. బీసీ ఎస్సీ ఎస్టీ – జేఏసీ నాయకులు మాట్లాడుతూ సమ సమాజాన్నీ స్థాపించడానికి ప్రతి ఒక్కరూ పాల్పడాలని సమాజంలో ప్రతి వ్యక్తికి విద్య అవసరమని,అందుకు తన కుటుంబం నుండి సావిత్రిబాయి పూలేను మహిళల విద్య కోసం పంపించడం జరిగింది.. విద్య వల్లనే ప్రస్తుతం విప్లవాత్మక మార్పులు వచ్చాయని మహాత్మా జ్యోతిరావు పూలే సేవలను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నల్ల నీరజ సతీష్ రెడ్డి, మరియు ముదిరాజ్ సంఘం మండల అధ్యక్షుడు కోమల జలంధర్, వార్డు సభ్యులు ఐతర వేణి మధు,సంగం కళ్యాణం,బీసీ, ఎస్సీ, ఎస్టీ- జేఏసీ గొల్లపెల్లి మండల కమిటీ నాయకులు, ప్రధాన కార్యదర్శి బాలే అశోక్,పట్టణ అధ్యక్షులు శాతల్ల లక్మన్, ప్రధాన కార్యదర్శి గంగాధర మధుసూదన్, ఉప అధ్యక్షులు ఎనగందుల అశోక్, కళ్ళేపెళ్లి తిరుపతి, చిలుముల జాను, చెవులమద్ది గంగాధర్, రజక సంఘం అధ్యక్షులు కలకోట సత్యం, జేరిపోతుల వంశీ, నల్ల విక్రమ్,తడగొండ పవన్, సిరికొండ తిరుపతి, రాకేష్, ఎనగందుల గణేష్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *