ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సహకారంతో తుమ్మలపల్లి లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు .

* సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో తుమ్మలపల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 14. చండూరు మండలం తుమ్మలపల్ల గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందిన పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని (చెక్కులు) మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో లబ్ధిదారులకు తుమ్మలపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. లబ్ధి పొందిన ముగ్గురు వ్యక్తులకు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ముఖం యాదమ్మ 32,000 వేలు, ముఖం శివరాజ్ 22,000 వేలు. జక్కలి మల్లయ్య 13,500 రూపాయలు విలువగల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకులు కురుపాటి శేఖర్ ఎస్సీ సెల్ చండూరు మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు గుండ్రెడ్డి రామలింగారెడ్డి, గుండ్రెడ్డి సంజీవరెడ్డి, ముఖం శీను, మలిగిరెడ్డి కృష్ణారెడ్డి, బుతరాజు సైదులు, కురుపాటి శ్రీకాంత్, కేతమల్ల ప్రకాష్,గ్రామప్రజలపాల్గొనారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *