ప్రజల దాహార్తిని తీర్చేందుకే చలివేంద్రం ఏర్పాటు

అశ్వారావుపేట లో చలివేంద్రం ప్రారంభించిన చైర్ పర్సన్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజల దాహార్తిని తీర్చేందుకు అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు ప్రాంతాలలో చైర్ పర్సన్ జూపల్లి శశికళ చేతుల మీదుగా మంగళవారం పట్నంలోని రింగ్ రోడ్డు సెంటర్లో మరియు పోలీస్ స్టేషన్ వద్ద చలివేంద్రాలను ప్రారంభించి ప్రజలకు మంచినీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ వేసవి తాపం దృష్ట్యా ప్రజలు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా నిత్యం మంచినీటి సౌకర్యం అందుబాటులో ఉండేలా ఈ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు వేసవిలో కూడా తప్పులు తగలకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు ఈ కార్యక్రమంలో కమిషనర్ బి నాగరాజు తో పాటు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *