పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి,సెంటినరీ కాలనీ -15 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్134వ జయంతి సందర్భంగా రామయ్య పల్లి గ్రామంలో అంబేద్కర్ సెంటర్ నందు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన తాజా మాజీ ఎంపీపీ అరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్, సర్పంచ్ కన్నూరి రవీందర్ మాజీ సర్పంచ్ శంకేసి రవీందర్, మాజీ సర్పంచ్ దేవునూరి రజిత శ్రీనివాస్, అంబేద్కర్ సంఘం నాయకులు.అనంతరం వారు మాట్లాడుతూ…డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాసి పేద ప్రజల బతుకుల్లో వెలుగులు నింపారని అన్నారు. అటువంటి మహానేత రాజ్యాంగ స్ఫూర్తిని అంబేడ్కర్ ఆశయాలను దెబ్బతీసేలా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని వారి కుట్రను తిప్పికొట్టేందుకే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ యాత్ర కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నదని అన్నారు. అణగారిన వర్గాలకి డా బి ఆర్ అంబేద్కర్ ఆశా కిరణం అని బడుగు బలహీనుల జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు అని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో బావు,రాయమల్లు మొగిలి నరేష్,ఆడపు రాజయ్య, కన్నూరి ఓదెలు, సదానందం, మహేందర్, కర్ణాకర్, సతీష్, అజయ్, శ్రీహరి, సంతోష్, కాటిపల్లి శంకర్, ఆరెల్లి మహేందర్ గౌడ్,మాటేటి శ్రీనివాస్,అంబేద్కర్ మేధావులు,గ్రామస్తులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు