రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని ఉజ్మా ని ఘనంగా సన్మానించిన రేగుంట ఉప సర్పంచ్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి ఏప్రిల్ 15 రేగుంట గ్రామానికి చెందిన హాసన్-జుబేదా కూతురు రజాక్-సలీమా మనవరాలు కుమారి ఉజ్మా ఇంటర్ పలితాలలో బైపీసీ విభాగంలో రాష్ట్రంలో నంబర్ వన్( ప్రథమ ) ర్యాంక్ సాధించిన సందర్బంగా రేగుంట గ్రామ ఉప సర్పంచ్, గనవేని నందిని మల్లేష్ యాదవ్, అంబేద్కర్ యూత్ సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలిపారు.. ఈ సందర్బంగా రేగుంట ఆల్ యూత్ అసోసియేషన్ & స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లేష్ యాదవ్ మాట్లాడుతూ కుమారి ఉజ్మా కష్టపడి చదివి రాష్ట్రంలోనే మొదటి ర్యాంక్ సాధించడం రేగుంటకే గర్వ కారణమని రేగుంట విద్యార్థులతో పాటు అనేక మంది విద్యార్థులకు ఆదర్శంగా నిలిచారాని అన్నారు.. ఈ కార్యక్రమంలో.. సర్పంచ్ తీట్ల లహరి రాజేష్,కార్యదర్శి వినీత అంబేద్కర్ యూత్ అధ్యక్షుడు బొల్లారపు వినోద్ వార్డ్ మెంబర్ బొల్లారపు పుష్ప విజయ్, యూత్ సంఘ నాయకులు వార్డ్ మెంబర్లు, యువకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *