గుండ్రపల్లి లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు‌…!

గుండ్రపల్లిలో అంబానీ ఆశయాల బాటలో పయనిద్దాం

పయనించే సూర్యుడు న్యూస్ చండూరు ఏప్రిల్ 15 : భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని చండూరు మండలం, గుండ్రపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించారు.. ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ నల్లగొండ జిల్లా ఉపాధ్యక్షులు కురుపాటి గణేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.. కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహాన్ని భారీ గజమాలతో సత్కరించి, ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు.. అనంతరం గ్రామంలోని పేదలకు, వృద్ధులకు మరియు చిన్నారులకు పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు..ఈ సందర్భంగా కురుపాటి గణేష్ మాట్లాడుతూ, దేశానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఆయన రాసిన రాజ్యాంగం వల్లే నేడు అణగారిన వర్గాలకు హక్కులు లభిస్తున్నాయని కొనియాడారు.. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని, సమానత్వ సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.. ఈ వేడుకల్లో చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూతరాజు ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ గుండ్రపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు కాసాల పాండురంగారెడ్డి, ఉపాధ్యక్షులు కురుపాటి శ్రీను, కాంగ్రెస్ నాయకులు ఎలవర్తి శ్రీను,కురుపాటి పరమేష్,ఎలవర్తి రవి, కురుపాటి రాములు, సత్తయ్య, పలువురు గ్రామ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో గ్రామ ప్రజలు మరియు మహిళలు పాల్గొని అంబేద్కర్ జయంతిని విజయవంతం చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *