పెనుగంచిప్రోలులో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ – పాల్గొన్న తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ బాబు (ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం): ఏప్రిల్ 16 పెనుగంచిప్రోలు పట్టణంలోని తుఫాన్ కాలనీలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం సాయంత్రం అత్యంత వైభవంగా జరిగాయి. అంబేద్కర్ యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నూతనంగా నిర్మించిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకలకు జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇంచార్జ్, మాజీ కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆయన మాట్లాడుతూ “భారత రాజ్యాంగ నిర్మాతగా అంబేద్కర్ అందించిన సేవలు చిరస్మరణీయం. కులమతాలకు అతీతంగా సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని తెలిపారు” ఇంతటి మహోన్నతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పెనుగంచిప్రోలు గ్రామ వైసీపీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్ కి , తుఫాన్ కాలనీ అంబేద్కర్ కమిటీ సభ్యులు చింతమాల హరి టీమ్, మరియు గడాటి పెద్దోడు కు నాగేశ్వరరావు ప్రత్యేక అభినందనలు తెలిపారు. జయంతి వేడుకల సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం మరియు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *