జన గణనకు శిక్షణ తరగతులు..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 10, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) దేశవ్యాప్తంగా 2027 ఫిబ్రవరి నా ప్రారంభమైంచబడుతున్న జన గణన కోసం ముందుగా కుటుంబాల సభ్యుల వివరాలను సేకరించేందుకు మొదటిగా శిక్షణ కార్యక్రమాన్ని నేటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు సిబ్బందితో నిర్వహించడం జరుగుతున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి నాయక తెలిపారు గురువారం కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో జనగణన కార్యక్రమానికి సంబంధించి ఈ శిక్షణా తరగతులు లకు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుగా 2021 జనగణన ప్రారంభించవలసి ఉంటుందని అయితే కరోనా నేపథ్యంలో వాయిదా పడినట్లు తెలిపారు. 2027 లో జనగణన కోసం ఈ శిక్షణ తరగతులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారుm మే ఒకటి నుండి 30వ తేదీ వరకు ఇంటింటి సర్వే నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. జిల్లా వ్యాప్తంగా 3712 హెచ్ ఎల్ బి (హౌస్ లిస్టింగ్ బ్లాక్) లు కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి 360 మంది సభ్యులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఎస్ఎల్వి కుమారి, ఆర్ఐ భవాని, సురేష్, ఏఎస్ఓ చాగంటి శ్రీకాంత్, మరియు ఫీడ్ ట్రైనర్స్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *