మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి

కూలీల హక్కుల కోసం – సిపిఐ–బి కే ఎం ఎం ఉద్యమానికి సిద్ధం!

పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్. దేశంలోనే అతిపెద్ద ఉపాధి హామీ పథకమైన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాలు అలాగే కొనసాగించి ప్రభుత్వం మార్చిన పేరు వి బి జి రాంజీ పథకాన్ని తొలగించాలని సిపిఐ పట్టణ కార్యదర్శి టి.వీరేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు కొత్తూరు గంగన్న డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక ఏఐవైఎఫ్ కార్యాలయంలో ఏప్రిల్ 10 నుండి 12 వరకు జరుగు పాదయాత్రకు సంబంధించిన గోడ పత్రికలను సిపిఐ బికేఎంయు నాయకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూలీలను బానిసలుగా చేసేందుకు ప్రభుత్వం యత్నాలు వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.వ్యవసాయ కార్మికులు 100 రోజుల పని పొందాల్సిందే అనే నిబంధనను తుంగలో తొక్కుతూ జిల్లా మొత్తం మీద 30 రోజులు కూడా పని ఇవ్వకుండా పథకాన్ని పూర్తిగా కుంగ దీస్తున్నారని మండిపడ్డారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రాజకీయ ఒత్తిళ్లతో పని జారీని అడ్డుకుంటున్నారని, వేల కుటుంబాలు ఆకలి సమస్యతో పోరాడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.గిరిజన గ్రామాలు, వెనుకబడిన మండలాలు, మహిళలు–వృద్ధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనమని వారు స్పష్టం చేశారు.ఉద్యమాన్ని విజయవంతం చేయడానికి ప్రజలు, వ్యవసాయ కూలీలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబానికి 100 రోజుల గ్యారంటీ పని ఇవ్వాలి, పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయాలి, జాబ్ కార్డులపై జరుగుతున్న అక్రమాలను అత్యవసరంగా నిలుపుదల చేయాలి, అధికారుల అవినీతి, నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి,గ్రామాల్లో జరుగుతున్న బోగస్ పనులపై ప్రత్యేక దర్యాప్తు చేయాలి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఆదోని మండలం.2 సిపిఐ పట్టణ సహాయ కార్యదర్శి రమేష్2 అధ్యక్ష కార్యదర్శులు ఎల్లప్ప సత్యనారాయణ రైతు సంఘం నాయకులు బసాపురం గోపాల్ బిహెచ్పిఎస్ అధ్యక్ష కార్యదర్శులు కొత్తూరు ఈరన్న విజయ్ కుమార్ నరసప్ప లింగప్ప పుష్ప రాజ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *