చికెన్ సెంటర్ యజమానులకు మున్సిపల్ నోటీసులు

పయనించే సూర్యుడు , 10 ఏప్రిల్ 2026, భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి ,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలోని చికెన్ షాప్ యజమానులకు మున్సిపల్ అధికారులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. చికెన్ వ్యర్థాలను పట్టణంలో ఎక్కడపడితే అక్కడ పడేయడం వల్ల దుర్వాసన వస్తోందని గుర్తించారు. పట్టణంలోని కుప్కల్ రోడ్డులో ఉన్న డంపింగ్ యార్డ్‌లోనే చికెన్ వ్యర్థాలను వేయాలని ఆదేశించారు. ఆదేశాలను పాటించకపోతే మున్సిపల్ చట్టం 2019 ప్రకారం జరిమానా విధించి కేసులు నమోదు చేస్తామని కమిషనర్ గోపు గంగాధర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *