పయనించే సూర్యుడు న్యూస్ యాడికి ఏప్రిల్ 11 యాడికి మండలం కమలపాడు రోడ్డు రాఘవేంద్ర కాలనీలో ఉన్న ఆగాపే ఆశ్రమంలో పులివెందల దంతులూరు కృష్ణ గారి పుట్టినరోజును ఆశ్రమంలో ఘనంగా చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి, బాలగంగాధర్, మోహన్, భీమారెడ్డి మరియు గంగాధర్, వెంకటేష్ వీరి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకను అలాగే అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అగాపే ఆశ్రమంలోనికి వీరంతా వచ్చి భారీ ఎత్తులో కేక్ కటింగ్ చేసి, సమృద్ధిగా విందు ఏర్పాటు చేయించి, ఆశ్రమంలో వృద్ధులకు, నిరాశ్రయులకు వారే భోజనాలు వడ్డించారు. ఇందు నిమిత్తమై ఆశ్రమ ఫౌండర్ బత్తల ప్రసాద్, ఆశ్రమంలోని వారంతా దంతులూరు కృష్ణ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి, అన్నదానం చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేశారు.
