పయనించే సూర్యుడు ఏప్రిల్ 11 నాగర్ కర్నూల్ జిల్లా బిజినాపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలోని బిసి సంఘం కార్యాలయంలో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి బిసి సంఘం మండల అధ్యక్షులు వేముల సత్యశీలసాగర్ మాట్లాడుతూ, రేపు బిజినపల్లి మండల కేంద్రంలోని జ్యోతి రావు పూలే–అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం 9 గంటలకు మహాత్మ జ్యోతి రావు పూలే జయంతిని మొదటి వార్షికోత్సవంగా ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల బిసి కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, సభ్యులు, సోషల్ మీడియా ప్రతినిధులు, కుల సంఘాల నాయకులు, దళిత, గిరిజన, మైనారిటీ సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, మేధావులు, కళాకారులు, కవులు, విద్యావేత్తలు, ఉద్యోగ సంఘాల నాయకులు, కార్మికులు, రైతులు, కూలీలు, పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా ప్రతినిధులు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ ప్రెస్ మీట్లో బిసి సంఘం మండల గౌరవ అధ్యక్షులు అంతటి రాజేందర్ గౌడ్, మండల కోశాధికారి వంగ రామన్ గౌడ్, బిసి నాయకులు బంగారి పర్వతాలు, తుమ్మల అల్లోజీ, ఊర్కొండ రఘుబాబు, అమీర్, దాసర్ల తిరుపతయ్య, వేణు గౌడ్, రాములు తదితరులు పాల్గొన్నారు.