మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా.

చిత్రపటానికి పూలమాల వేసేన కర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు , జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ , టీడీపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్థానిక బిర్లా గేట్ దగ్గర మాహత్మ జ్యోతిబా పూలే 200వ జయంతోత్సవం లో పాల్గొనడం జరిగింది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి, మహిళా విద్యాభివృద్ధికి చేసిన సేవలు అపారమని అన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం కురుబ కార్పొరేషన్ కార్పొరేషన్ చైర్మన్లు దేవేంద్రప్ప, , డైరెక్టర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహాత్మ పూలే సేవలను స్మరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *