70 ఏళ్లుగా సాగులో ఉన్న భూమిపై నిర్మాణం వివాదం

"అంగన్వాడి భవనంపై ఎంపీడీవోకు వినతి పత్రం అందజేసిన బాధ్యులు"

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండలం, సిద్దిపేట్ జిల్లా ముభారస్‌పూర్ గ్రామంలో అంగన్వాడీ భవనం నిర్మాణంపై వివాదం నెలకొంది. గ్రామంలోని పులిమామిడి నరసవ్వ ఇంటి వెనకాల ఉన్న భూమిలో అంగన్వాడీ నిర్మించాలని ఇటీవల నిర్వహించిన గ్రామ సాధారణ సమావేశంలో తీర్మానం చేసినట్లు సమాచారం. అయితే, ఈ సమావేశాన్ని సర్పంచ్ ఆధ్వర్యంలో నిర్వహించినప్పటికీ ఉపసర్పంచ్ మరియు వార్డ్ సభ్యులకు సరైన సమాచారం ఇవ్వకుండా ప్రతిపక్ష వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై పంచాయతీ కార్యదర్శిని అడిగినప్పుడు, ఆ భూమిలోనే అంగన్వాడీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇక, ఆ భూమి గత 70 నుంచి 20 సంవత్సరాలుగా పలువురు వ్యక్తుల ఆధీనంలో ఉందని వారు చెబుతున్నారు. షేర్‌పల్లి నరసయ్య, చెరుపల్లి మల్లయ్య, షేర్‌పల్లి డాకులు, షేర్‌పల్లి స్వామి, షేర్‌పల్లి యాదయ్య, షేర్‌పల్లి ఎల్లయ్య, బుచ్చల పోషవ్వ, బుచ్చల నరసవ్వ తదితరులు తమ పూర్వీకుల కాలం నుంచే ఆ భూమిని సాగు చేసుకుంటున్నామని పేర్కొన్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఏర్పడిన రాజకీయ విభేదాల కారణంగా ప్రతిపక్ష వర్గం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వారు ఆరోపించారు. ఈ భూమిని తమ తాతలు, తండ్రులకు వెట్టిచాకిరి కింద పటేళ్లు సాగు చేయమని ఇచ్చారని, అందువల్ల ఈ భూమిపై ఎలాంటి నిర్మాణ నిర్ణయాలు తీసుకోరాదని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిదో వార్డ్ సభ్యుడు సహా గ్రామానికి చెందిన పది మంది సమక్షంలో ఎంపీడీవోకు లిఖితపూర్వక ఫిర్యాదు సమర్పించారు. చిన్న లచ్చి, సల్మాన్, పార్నంది స్వామి, పసులది అనిల్, బుచ్చల ప్రవీణ్, షేర్‌పల్లి శ్రీకాంత్, షేర్‌పల్లి స్వామి, షేర్‌పల్లి మల్లయ్య, షేర్‌పల్లి డాగులు, చింతకింది స్వామి, పసులది మహేష్ తదితరులు ఈ ఫిర్యాదుకు మద్దతు తెలిపారు. గ్రామంలో ఈ అంశం ఉద్రిక్తతకు దారి తీస్తుండగా, సంబంధిత అధికారులు విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *