రాయపల్లి స్టేజ్ వద్ద” చలివేంద్రం” ప్రారంభం

బాటసారుల దాహం తీర్చేందుకే చలివేంద్రం _ గోనయో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12, మహబూబ్ నగర్ జిల్లా రిపోర్టర్ నరిగె కళాశేఖర్: వేసవి కాలంలో పెరుగుతున్న ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, బాటసారుల , గ్రామ ప్రజల దాహం తీర్చడమే లక్ష్యంగా రాజాపూర్ మండలం రాయపల్లి స్టేజ్ వద్ద చలివేంద్రాన్ని గోనయో ఫౌండేషన్ వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి ఆధ్వర్యంలో రాయపల్లి డీలర్ వడ్ల రామాచారి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వడ్ల రామాచారి మాట్లాడుతూ.. ఎండాకాలంలో ప్రజల తాగునీటి అవసరాలను గుర్తించి, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్న తన కుమారుడు ప్రశాంత్ చారిని అభినందించారు. అనంతరం ప్రశాంత్ చారిని, రామాచారి ని రాయపల్లి ,రాజాపూర్ ,ముదిరెడ్డి పల్లి యువకుల సమక్షం లో రాజపూర్ మండల ఏబీవీపీ నాయకులు హన్మగల్ల బాల్ రాజ్ శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నరిగె లక్ష్మయ్య, ముదిరెడ్డిపల్లి వార్డ్ మెంబర్ గంగాధర్ గౌడ్, రాయపల్లి వార్డ్ మెంబర్ నరిగె శ్రీనివాసులు, రాయపల్లి, ముదిరెడ్డిపల్లి , రాజాపూర్ గ్రామాలకు చెందిన యువకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *