12వ తేదీ శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ట మహోత్సవం.. మహా అన్నసంతర్పణ..

పయనించే సూర్యుడు ఏప్రిల్ 12, కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ (బి వి బి) శనివారం ఉదయం 9 గంటలకు శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ట మహోత్సవాన్ని పండితులు బ్రహ్మశ్రీ పొదిల కొండబాబు ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సౌజన్యంతో ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఈ ప్రతిష్ట కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ రావడం జరుగుతుందని అన్నారు. కాకినాడ రూరల్ మండలం సర్పవరం గ్రామంలో వెలసిన శ్రీ విజయ కనకదుర్గ అమ్మవారి దివ్య ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించి అనంతరం మహా అన్న సంతర్పణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు పీటలపై తోట చక్రయ్య సూర్య కుమారి దంపతులు కూర్చుని ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. అలాగే శనివారం సంకల్పం గణపతి పూజలు హోమాలు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తులు తరలి రావాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆలయ పెద్దలు గ్రామస్తులు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *