పయనించే సూర్యుడు, ఏప్రిల్ 12 రంగారెడ్డిజిల్లా ప్రతినిధి ఎస్ఎంకుమార్ భారత ప్రధమ సమాజికతత్వవేత్త, అంటరానితనం, కులవ్యవస్థ నిర్ము లనతోపాటు మహిళోద్దరణకు కృషి చేసిన మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా అల్విన్ కాలనీ డివిజన్ మాజీ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ గారు మరియు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ మహాత్మా జ్యోతిరా వు ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడు తూ .ప్రతిఒక్కరూ మహాత్మా జ్యోతిరావు ఫూలేను స్ఫూర్తిగా తీసుకొని నవసమాజ నిర్మాణానికి కృషి చేయాలని అన్నారు. సమాజంలో సమానత్వం తీసుకురావ డా నికి చదువు ఒకటే మార్గం అని నమ్మి న వ్యక్తి జ్యోతి రావుపూలే. దేశంలో అక్షరాస్యతను పెంచేందుకు తన భార్య కు అక్షరాలు నేర్పించి మొదటి మహిళా ఉపాధ్యాయురాలిని చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల హక్కులపై పోరాడి అండగా నిలిచిన పోరాట యోధుడు జ్యోతిరావు ఫూలే అని అన్నారు.అంద రికీ విద్య అందిం చేందుకు ఆయన చేసిన కృషి చిరస్మరణీ యమని తెలియ చేసారు.కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పాండు గౌడ్, గోపాల్, గుడ్ల శ్రీనివాస్, అగ్రవాసు, వాసుదేవరా వు, లింగం ,సుధాకర్, మజర్, రవీందర్, రాజుగౌడ్, పద్మయ్య, గంధం సుమ న్, గంధం నాగేష్ తదితరులు పాల్గొన్నారు.