క్రికెట్ బెట్టింగ్ నిర్వహించు వారికి కౌన్సిలింగ్ ఇచ్చిన వన్ టౌన్ సీఐ.

పయనించే సూర్యుడు ఏప్రిల్ 14 కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్. ఆదోని వన్ టౌన్ పిఎస్ పరిధిలోని క్రికెట్ బెట్టింగ్ నిర్వహించు వారిని ఈ దినము స్టేషన్ కు పిలిపించి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగినది. పోలీసువారి ఆదేశాలకు విరుద్ధంగా క్రికెట్ బెట్టింగ్ నిర్వహించిన ఎడల వారిపై పిడి చట్టం ప్రయోగించడంతోపాటు ఈ క్రికెట్ బెట్టింగ్ ద్వారా సంపాదించుకున్న వారి ఆస్తులన్నీ జప్తు చేస్తామని మరియు వారి యొక్క బ్యాంకు ఖాతాలు అన్నీ నిలిపివేయబడతాయని సూచనలు ఇవ్వడం జరిగినది. క్రికెట్ బెట్టింగ్ నిర్వహించు వారికి వేరే ఎవరైనా సహకరించిన యెడల వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోబడును అని హెచ్చరించడం జరిగినది. పి చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఆదోని వన్ టౌన్ పిఎస్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *