ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సొళ్ల.బొజ్జిరెడ్డి కలిసి చింతూరు డివిజన్ పలు సమస్యలపై ఆదివాసీ జేఏసీ డివిజన్ నాయకులు

పయనించే సూర్యుడు ప్రతినిధి జర్నీ నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 14 పోలవరం జిల్లా చింతూరు మండల చింతూరు డివిజన్ పర్యటనలో చింతూరు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ళ. బోజ్జి రెడ్డి ని చింతూరు డివిజన్ మండల ఆదివాసి నాయకులు చట్టి గ్రామ యువతి,యువకులతో కలిసి పలు సమస్యలపై ఉపాధి అవకాశాల కోసం వినతి పత్రాలు అందజేయడం జరిగింది.వాటి పరిష్కర నిమిత్తం రంపచోడవరం ఎస్టీ కమిషన్ చైర్మన్ ఆఫీసులో మరలా కలిసి యువతి, యువకులకు ఉపాధి అవకాశాలు మరియు సమస్యల పరిస్కారం గురించి గుర్తుచేస్తూ తక్షణమే సమస్యలపై చర్యలు, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పడం జరిగింది. అలాగే చింతూరు మెయిన్ రోడ్ సెంటర్ లో ఆదివాసి కూరగాయల వ్యాపారస్తులకు పాత హాస్పిటల్ ప్రహరీ పక్కన సొంత మార్కెట్ షెడ్లను నిర్మించి వారి జీవనోపాధికి సహకరించగలరని మరొక్కసారి తెలియజేయడం జరిగింది. తెలియజేసిన అన్ని విషయాలను ఎస్టీ కమిషన్ చైర్మన్ శ్రీ సోళ్ళ బోజ్జి రెడ్డి గారు సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే అన్ని సమస్యలకు పరిష్కార దిశగా చర్యలు చేపడతామంటూ తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆంధ్రప్రదేశ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ రామారావు దొర,ఆదివాసీ జేఏసీ సెంట్రల్ కమిటీ మెంబెర్ మడివి నెహ్రు, డివిజన్ చైర్మన్ జల్లి. నరేష్, మండల చైర్మన్ పొడియం. రామకృష్ణ, మండలం వైస్ చైర్మన్స్ శీలం. తమ్మయ్య, కాక. సీతారామయ్య, పూనెం. శ్రీను తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *