డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు

పయనించే సూర్యుడు ఏప్రిల్ 15 డివిజన్ ప్రతినిధి సిరం దాసు వెంకటేశ్వర్లు దేవరకొండ జిల్లా నల్గొండ బార్ అసోసియేషన్ 14-04-2026 న దేవరకొండ న్యాయస్థానంలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మండల న్యాయ సేవాధికారం సంస్థ చైర్మన్ మరియు సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కే అనిత , జూనియర్ సివిల్ జడ్జ్ స్నేహ మరియు సీనియర్ న్యాయవాదులు గాజుల ఆంజనేయులు, నేమ్మి కంటి గౌరీ శంకర్, కార్యదర్శి వనం జగదీశ్వర్ పాల్గొని డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఫోటోకు పూల మాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన ద్వారా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా జడ్జ్ మాట్లాడుతూ భారతదేశంలో ఒక జాతీయ స్థాయి పౌర కార్యక్రమంగా, సమానత్వం, రాజ్యాంగ హక్కులు మరియు అందరికీ విద్య కోసం వాదించిన ప్రముఖ సంఘ సంస్కర్త మరియు న్యాయవేత్త అయిన డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ జన్మదినం స్మరించుకుంటుంది. ముఖ్యంగా ఈ రోజు ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సమానత్వం మరియు కుల వివక్ష నిర్మూలనపై ఆలోచనలను ప్రోత్సహిస్తుందిభారత రాజ్యాంగ రూపకల్పనలో ఆయన పోషించిన అపారమైన పాత్రకు, అలాగే మహిళల హక్కులు మరియు కార్మిక సంస్కరణల కోసం ఆయన చేసిన కృషికి డాక్టర్ అంబేద్కర్ గౌరవించబడ్డారు. మీ ఆశయ సాధనలో, అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నిలువాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈనాటి కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు వస్కూల శ్రీనివాసులు, చెనగాని అశోక్, ఇడం రవికుమార్, ఉప్పల రమేష్, ఎండి రియాజుద్దీన్, సభావత్ శ్రీకాంత్, యాదయ్య, శంకర్, బోలె సాయి, నక్క వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, బొడ్డు ఆంజనేయులు, శ్రీరామ్, సురేష్, రమేష్, షణ్ముఖ, బిక్షపతి మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *