ప్రపంచానికి ఆదర్శం అంబేద్కర్

* స్త్రీ సమానత్వ హక్కుకై పోరాడిన మహనీయుడు * అంబేద్కర్ 135 జయంతి వేడుకల్లో చైర్పర్సన్, కమిషనర్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 అశ్వారావుపేట మండలం రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అణగారిన అన్ని వర్గాల ప్రజల హక్కుల కొరకై పోరాడి ప్రపంచ ఖ్యాతిని పొందిన మహనీయుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను మున్సిపల్ కార్యాలయం తో పాటు మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ నగర్ మంగళవారం లో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కమీషనర్ బి నాగరాజు, అంబేద్కర్ నగర్లో జరిగిన కార్యక్రమంలో చైర్పర్సన్ జూపల్లి శశికళ మాట్లాడుతూ స్త్రీ సమానత్వం తో పాటు హక్కులకై పోరాడి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నిలి రాజ్యాంగాన్ని రూపొందించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మున్సిపల్ సిబ్బంది స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *