చిలకలూరిపేటలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహణ

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 15 యడ్లపాడు మండల ప్రతినిధి.. చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి విడదల రజిని ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో విడదల రజిని అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అంబేద్కర్ ఆశయ సాధన కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. అనంతరం ఆమె ఆధ్వర్యంలో భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ఎన్ ఆర్ టి సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నాయకులు, కార్యకర్తలు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ ఆశయాలను కొనియాడారు ఈ కార్యక్రమంలో యడ్లపాడు మండలానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా పాల్గొన్నారు. యడ్లపాడు మండల పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు పఠాన్ రెహ్మాన్ ఖాన్, కర్నాటి సుబ్బారావు, రాచమంటి చింతరావు, వలేటి ఉదయ్ తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *