భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్. బి ర్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ చింతూరు

పయనించే సూర్యుడు ప్రతినిధి జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ ఏప్రిల్ 15 పోలవరం జిల్లా చింతూరు లో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ ఆధ్వర్యంలోబడుగు,బలహీన వర్గాల ఆశ జ్యోతి,భారత రాజ్యాగ నిర్మాత,భారత దేశం లో అన్ని వర్గాలకు సమాన హక్కులు,ఎస్సి ,ఎస్టీ లకు ప్రత్యేక హక్కులు కల్పించి నా డాక్టర్.బి. ఆర్.అంబేద్కర్ 135వ జయంతి నీ స్థానిక బాలుర హాస్టల్ ఘనంగా నిర్యావహించడం జరిగింది.ఈ కార్యక్రమం నీ ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ ఈ రోజు భారత దేశం లో ఇంతటి స్వేచ్ఛ జీవితాన్ని గడుపుతున్నామంటే రాజ్యాంగం యొక్క ప్రతిభ ఉండబట్టే సాధ్యపడిందన్నారు. అలాగే ఐదవ షెడ్యూల్,ఆరవ షెడ్యూల్ భూభాగంలో ఈ దేశానికే మూలవాసులుగా ఉన్నటువంటి ఆదివాసుల కోసం రాజ్యాంగంలో పొందపరచడం అనేది గొప్ప విషయం. రాబోవు రోజుల్లో ఆదివాసీ యువత,మేధావులు ప్రజానీకం ఏకమై రాజ్యాంగపరంగా ఆదివాసులకు ఏవైతే హక్కుల్ని రాజ్యాంగ చట్టబద్దంగా పొందుపరిచారో ఆదివాసుల హక్కుల చట్టాలను అమలు చేసే దిశగా షెడ్యూల్ ప్రాంతాలలో అధికారులు వాటిని అమలు చేసే విధంగా మన హక్కులను సాధించుకోవడానికి ప్రజా ఉద్యమం సిద్ధం కావాలి అని పిలుపు ఇచ్చారు అలాగే ఈ సందర్భంగా తెలియజేశారు. నేటి యువత కు బాబాసాహెబ్ అంబేద్కర్ కు స్పూర్తి అన్నారు ఈ కార్యక్రమంలో మండల చైర్మన్ పోడియం. రామకృష్ణ వైస్ చైర్మన్లు కారం.సాయిబాబు కాక. సీతారామయ్య పూనెం. శ్రీను జల్లి హర్ష,ప్రవీణ్ తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *