డా:బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కృషి చేయాలి

* సుంకర మధుసూదన్, కొలపాక నాగేశ్వరరావు జి.యం.లు

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-15 డా:బి.ఆర్.అంబేద్కర్ ఆశయాల కోసం అందరూ కృషి చేయాలనీ రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు అన్నారు.భారతరత్న, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సింగరేణి సంస్థ ఆర్.జీ-3 & ఏ.పి.ఏ ఏరియాల ఆధ్వర్యంలో స్థానిక రాణిరుద్రమ దేవి క్రీడా ప్రాంగణం ముందు గల ప్రాంగణం లో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఇట్టి వేడుకలకు రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై పతాకావిష్కరణ గావించి జయంతి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. ముందుగా బి.ఆర్.అంబేద్కర్ విగ్రహానికి, చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం నిర్వహించిన సభా కార్యక్రమంలో భాగంగా వారు మాట్లాడుతూ మన దేశం భిన్న సంస్కృతులు, భాషలు, ప్రాంతాలు, ఆహారపు అలవాట్లు కలిగిన దేశం.అణగారిన వారికి ప్రత్యేక హక్కులు అవకాశాలు ఉన్నప్పుడే బడుగు, బలహీనవర్గాలు, కార్మిక వర్గాలు అభివృద్ధి చెందుతాయని అంబేద్కర్ భావించి వారికి ఆ దిశగా హక్కులు కల్పించారన్నారు.ఈ ప్రత్యేక అవకాశాలందుకుని అభివృద్ధి చెందిన వారు తాము పొందిన ఫలాలను ఇతరులకు కూడా అందేలా కృషి చేయాలన్నారు.డా:బి.ఆర్. అంబేద్కర్ కొందరి వాడు కాదని, అందరి వాడని అన్నారు. జయంతి సందర్భంగా స్థానికంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు.వేడుకల్లో భాగంగా జానపద కళాకారులు అంబేద్కర్ ఆశయాన్ని, గొప్పతనాన్ని వర్ణిస్తూ గీతాలు ఆలపించారు. ఈ వేడుకల్లో ఎస్వోటు జిఎం బి.వి.సత్య నారాయణ, గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్రరెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ఎస్సీ లైజన్ ఆఫీసర్ జి.మహేష్, ఎస్.టి.లైజన్ ఆఫీసర్ ఎల్.వినాయక్, ఓబిసి సంఘాల నాయకుడు తుమ్మ మధుసూదన్, ఎస్.సి, ఎస్.టి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు బత్తుల శంకర్, బాలంకూస్, భుక్య కిషన్ నాయక్, మలోత్ రమేష్, ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, సివిల్ డిజియం రాజేంద్ర కుమార్, అధికారులు ఐలయ్య, చంద్ర శేఖర్, ఉదయ్ భాస్కర్, షబ్బీరుద్దీన్, సునీల్ ప్రసాద్, రాజేశం, సేవా కార్యదర్శి ఉమాదేవి, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, సేవా సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *